అపురూప దివ్య క్షేత్రం అరసవల్లి; - సి.హెచ్.ప్రతాప్ ;- 95508 51075
 శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలో అరసవల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ద్వారా బహుళ ప్రసిద్ధి చెందింది. ఈ సూర్య నారాయణ స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా రెండు పర్యాయాలు సూర్యోదయాన సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలను తాకేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ దృశ్యం భక్తుల్లో ఆనంద పారవశ్యాన్ని, ఆధ్యాత్మికతను నింపుతుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు.  ఈ అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్నీ పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది.
ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా శ్రీ సూర్యనారాయణమూర్తిని  ఇక్కడ సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతిష్ఠించినట్లు ప్రతీతి.  త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ సూర్యనారాయణుడు శివ స్వరూపుడిగా జ్ఞానాన్ని, కేశవ స్వరూపుడిగా మోక్షాన్ని, తేజో స్వరూపుడిగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, జీవుడు అనే పన్నెండూ సృష్టికి కారణమవుతున్నాయని, ద్వాదశ మాసాత్ముడైన సూర్యుడు వీటి ద్వారా లోకపాలన చేస్తున్నాడని పెద్దలు చెబుతారు.
శ్రీ మహావిష్ణువు అవతారమైన బలరాముడు ద్వాపర యుగమ లో జీవులనుద్దరించేందుకు తన నాగేటి చాలు తో నాగావళి నదిని ఆవిర్బవింప చేసి ఆ తీరాన దేవాలయాన్ని ప్రతిష్టించారు అని గాథ. దీనిని తిలకించడానికి దేవతలు స్వర్గమా నుంచి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు అట. ఇంద్రుడు ఒక్కడు వేళా కు రాలేకపోయాడు. రాత్రి సమయాన చేరుకొని కోటిశ్వర దర్శనార్థం రాగ నందీశ్వరుడు ఆటకయించాడు. ఇంద్రుడు కోపావేశం తో వజ్రాయుధం ఎత్తగా నందీశ్వరుడు తన కొమ్ములతో దానిని విసిరిపరేసదట. ఆ దెబ్బకు ఇంద్రుడు స్పృహ తప్పి అరసవెల్లి ప్రాంతం లో పడిపోగా స్వప్నం లో ఇంద్రుడికి సూర్య భగవానుని విగ్రహం ప్రతిష్టించి ఆరాధించమని సందేశం రాగ ఇంద్రుడు అలాగే చేసి ఆరోగ్యవంతుడై తిరిగి తనలోకనికి చేరుకున్నాడని స్థల పురాణం. ఈ క్షేత్ర స్వామి గ్రహదిపతి కావడం వాళ్ళ దర్శన మాత్రమునే సర్వగ్రహహరిస్తా శాంతి లబిస్తుంది అని పురాణాలూ చెబుతున్నాయి.
 
 క్రీస్తుశకం ఏడవ శతాబ్దంలో కళింగ ప్రాంతాన్ని ఏలిన గంగ వంశపు రాజు దేవేంద్ర వర్మ అరసవల్లిలో సూర్యనారాయణుడి ఆలయాన్ని నిర్మించాడు. క్రీస్తుశకం 676 నుంచి 688 వరకు రాజ్యం చేసిన దేవేంద్ర వర్మ తన రాజ్యాన్ని చిలికా సరస్సు నుంచి గోదావరి తీర ప్రాంతం వరకు విస్తరించాడు. క్రీస్తుశకం 747లో ఆయన మనవడు అధికారానికి వచ్చాడు. ఆయన పేరు కూడా దేవేంద్ర వర్మే. తాత బాటలోనే పలు ఆలయ నిర్మాణాలు చేశాడు. ఆలయాల పరిరక్షణ కోసం శాసనాలు రాయించాడు. ఆయన రాయించిన మూడు శిలా శాసనాలు నేటికీ అరసవల్లి ఆలయ ప్రాంగణంలో పదిలంగా ఉన్నాయి.
శ్రీకాకుళం పట్టణంకు 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం ఉంది. అరసవల్లి ఆలయాన్ని సందర్శించే భక్తులు ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా సందర్శించి వెళుతుంటారు. ప్రపంచంలోనే విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభు ఆలయం ఇది.
సి హెచ్ ప్రతాప్ 


ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062
 


కామెంట్‌లు