పచ్చల సోమేశ్వరాలయం (పానగల్లు)- సి.హెచ్.ప్రతాప్ ;- సెల్ 95508 51075
 భాగ్య నగరానికి కి దగరలో ఉన్న ఒక పురాతన దేవాలయ ప్రసిద్ధి, కీర్తి ప్రతిష్టలు తెలుసుకుందాం.. నల్లగొండ ప్రాంతాన్ని అనుకోని ఉన్న పానగల్ లో ఒక పురాతన ప్రాచీన ఆలయం చుపురులను ఆకట్టుకుంటుంది ..నల్గొండ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో 'పానగల్లు' అనే గ్రామం కలదు. అక్కడ ఛాయా సోమేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధికెక్కింది. గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది. పైగా అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు రాదు. సాధారణంగా ‘నీడ’ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది. కానీ, ఈ నీడ సూర్యుడి వెలుతురుతో పనిలేకుండా ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది... ఛాయా సోమేశ్వర ఆలయం చుట్టూ ఎనిమిది వైపులా చిన్న చిన్న మండపాలు .... వీటి చుట్టూ మూడు గర్భగుడులు ఉన్న దేవాలయం ఉంటుంది. దీనినే 'త్రికూటాలయం' అంటారు.
సుమారు 800 ఏళ్ల కిందట కందూరు చాళుక్య ప్రభువైన ఉదయ భానుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం. ఈ ఆలయం త్రికూటాలయంగా మూడు గర్బాలయాలతో ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం పడమర దిక్కున ఉన్న గర్బగుడిలో ఉన్న శివలింగం మీదుగా ఈ నీడ కనిపిస్తుంది. ఇది వెలుతురు ఉన్నంత సేపు ఒకే చోట స్థిరంగా ఉంటుంది. సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు రాదు. సాధారణంగా ‘నీడ’ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది. కానీ, ఈ నీడ సూర్యుడి వెలుతురుతో పనిలేకుండా ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఆ నీడ  ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఆలయంలోని రెండు స్తంబాల్లో ఒకదాని నీడై ఉండొచ్చని భావించినా.. ఒకే నీడ రెండు స్తంబాలకు మధ్యలో ఉండే గర్బగుడిలోని విగ్రహం) వెనుక వైపు పడుతోంది. దీంతో ఈ నీడ దేనిదనేది మిస్టరీగా  మిగిలింది. భక్తులంతా ఇది దేవుడి మాయగా నమ్ముతారు.
ఈ ఆలయ శిల్పి.. గర్బగుడిలో పడే నీడకు.. సూర్యుడి కాంతితో పనిలేకుండా పగటి వేళల్లో వెలుతురు మాత్రమే ఉపయోగపడేలా ఆలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. దేవాలయానికే మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే.. ఆలయం పక్కనే ఉన్న ఉదయ సముద్రం చెరువులో నీరుంటే ఈ ఆలయ ప్రధాన గర్భగుడిలో నీరు ఉబికి వస్తుంటుంది.ఇలా ఎన్నో ప్రత్యేకతలు వున్న ఈ సోమేశ్వరాలయంలోని శివలింగాన్ని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజాది అభిషేకాలు చేస్తే అన్ని శారీరక, మానసిక రుగ్మతలు పోతాయన్నది అసంఖ్యాక భక్తుల విశ్వాసం.
సి హెచ్ ప్రతాప్ 


ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062
 


కామెంట్‌లు