జర్మనీలో 19 వ శతాబ్దంలో ఓబెర్లిన్ అనే పేరుగల ఒక మానవతామూర్తి, ఆధ్యాత్మికవేత్త వుండేవారు. ఆయన నిస్వార్ధంగా ఊరూరు తిరుగుతూ ప్రజలకు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ, వారి సమస్యలకు దైవ సంబంధమైన పరిష్కారాలు చూపిస్తూ వుండేవారు.
ఒకసారి ఆయన తన ఉపన్యాసం ముగించుకొని మరొక ఊరికి ప్రయాణమయ్యారు. ఇంతలో అకస్మాతుగా మంచు తుఫాను సంభవించి అందులో చిక్కుకుపోయారు. సహాయం కోసం ఎంతగా అరచినా అవి బధిర శంఖారావం అయ్యాయి. నాలుగు దిక్కుల నుండి మంచు కమ్మేయడం వలన పీకల్లోతు కూరుకుపోయి స్పృహ తప్పి పడిపోయారు.
ఇంతలో దేవుడల్లే ఒక నిరక్ష్యరాస్యుడైన కూలీవాడు అటు వెళుతూ ఓబెర్లిన్ ను చూసి, వెంటనే పారతో తవ్వి మంచు అంతా పక్కన పోసి ఆయనను బయటకు తీసాడు. రెండు గంటల పాటు మంచులో కూరుకుపోవడం వలన ఆయన ముఖం అంతా పాలిపోయి గుర్తు పట్టలేని విధంగా తయారయ్యింది.
ఆ కూలీవాడు ఓబెర్లిన్ ను తన వీపుపై మోసుకుపోయి, సమీపంలో వున్న తన చిన్న ఇంటికి తీసుకువెళ్ళి సపర్యలు చేయగా కొంతసేపటికి ఆయనకు స్పృహ వచ్చింది. కూలీవాడు ఇచ్చిన టి, తిండి సేవించిన తర్వాత ఆయనకు కాస్త శక్తి వచ్చింది.
తనను రక్షించినందుకు ఓబెర్లిన్ ఆ కూలీవాడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
" నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నీకు ఒక మంచి బహుమతి ఇవ్వదలచుకున్నాను. ఏం కావాలో అడుగు" అన్నాడు ఓబెర్లిన్.
"బహుమతా? నాకెందుకు మీ బహుమతి?" ఠక్కున అడిగాడు కూలీవాడు.
" నీ ప్రాణాలను పణంగా పెట్టి నా ప్రాణాలను కాపాడినందుకు" చెప్పాడు ఓబెర్లిన్.
" నేను ఒక సాటి మానవుడిని. ఆపదలో చూసాను. నా స్వధర్మంగా భావించి మిమ్మల్ని రక్షించాను. ఇందులో బహుమతి ప్రసక్తి ఎందుకు ? నేను సాటి మానవుల పట్ల నా కర్తవ్యం మాత్రమే నిర్వర్తించాను" చెప్పాడు ఆ కూలీవాడు.
" కనీసం నీ పేరైనా చెప్పు. నీ అభ్యున్నతి కోసం ప్రార్ధన చేస్తాను" అడిగాడు ఓబెర్లిన్.
" బైబిల్ లో దేవుని సహాయకుల పేరు ఎక్కడైనా చెప్పబడిందా ? నేనూ అంతే"
" ఎక్కడి నుండి నువ్వు ఇంత మంచి విషయాలు తెలుసుకున్నావు? నీ గురువు ఎవరు?" అడిగాడు ఓబెర్లిన్.
"ఓబెర్లిన్" ఠక్కున చెప్పాడు ఆ కూలీవాడు.
తన ఉపాన్యాసాలు ప్రజలను ప్రభావితం చేస్తూ , వారిని సమాజ హితం వైపు నడిపిస్తున్నందుకు ఆ భగవంతునికి మనస్సులోనే కృతజ్ఞతలు అర్పించుకున్నాడు ఓబెర్లిన్.
సి హెచ్ ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి