దీపావళి పర్వదినము; - శంకరప్రియ., శీల.,--సంచారవాణి: 99127 67098
 👌అసుర శక్తుల పైన
     అఖండ ఘన విజయము!
      దీపావళి పండుగ!
              ఓ తెలుగు బాల!
👌అమావాస్య రాత్రిని
     పున్నమి వెలుగు నొసఁగు!
      ఈ పర్వ దినమందు!
             ఓ తెలుగు బాల!
       ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌దీపావళి.. ఒక పర్వదినము! ఆసురీ శక్తులు పైన, అఖండ ఘన విజయ మహోత్సవం! ఆబాల వృద్ధు లందరు.. ఆనందోత్సహము లతో జరుపుకొనే పండుగ.. దీపావళి! ఇది.. ఆశ్వయుజ మాసం, అమావాస్యతిధిని వచ్చే పర్వదినము!
👌 "దీపావళి" గురించి గాధలు; జనశ్రుతిలో బహుళ ప్రచారములో ఉన్నాయి! విజయ దీపావళి.. విజయములను, శుభములను కలిగించు.. సకల మానవాళికి! శివమస్తు!
🚩సీస పద్యము🚩
      బలిచక్రవర్తిని బంధించి, పాతాళ మునకు, వామనుఁడు పంపినది నేఁడె!   
      రావణుం బరిమార్చి, రాముఁ డర్ధాంగితో, ననుజన్ము భరతుఁ గాంచినది నేఁడె!
       క్రూరుఁడౌ నరకాసురుని, సత్యభామ కృష్ణుని వెంటఁజని, వధించినది నేఁడె! 
       విక్రమార్కుఁడు శత్రువిజయంబుఁ గావించి, తనపేర శకము నిల్పినది నేఁడె !
         (తేట గీతి )
      శ్రీమహావీర జినుఁ డహింసా మహస్సు
      దెసలఁ బ్రసరింప సిద్ధిపొందినది నేఁడె!
      వచ్చె నిదిగొ సౌవర్ణ శోభాప్రపూర్ణ
      సర్వజనము! దీపావళీ పర్వ దినము !!
( విజయ దీపావళి., "డా. కరుణ శ్రీ.,"  )

కామెంట్‌లు
దీపావళి వైశిష్ట్యాన్ని కరుణశ్రీ గారి పద్యానుసారంగా
తెల్పటం బాగుంది . సమయోచితంగా విలసిల్లింది.