విజయ దశమి పర్వము శంకర ప్రియ., శీల.,సంచారవాణి: 99127 67098
 👌విజయమ్ముల నొసంగు
సకల మానవాళికి!
      విజయదశమి పర్వము!
ఆత్మ బంధువులార!
    (ఆత్మ బంధు పదాలు., శంకరప్రియ.,)
👌విజయదశమి పర్వదినము.. చాంద్రమానం ప్రకారం, ఆశ్వయుజ మాసములో.. శుక్ల దశమినాడు; ఆనందోత్సహములతో జరుపుకొనే పండుగ! ఆరోజున ఆరాధకులు, మరియు సాధకు లందరు భక్తి ప్రపత్తులతో.. అపరాజిత యైన పరమేశ్వరిని పూజించు చున్నాము!
👌ఆశ్వయుజ మాసం..  శరదృతువు ప్రారంభములో వస్తుంది! కనుక, శుద్ధ పాడ్యమి తిధి నుండి నవమి తిధి వరకు; శక్తి స్వరూపిణిని.. నవ దుర్గలుగా, నవ శక్తులుగా, వివిధ మూర్తులుగా భావించి; సేవించు చున్నాము! ఆది పరాశక్తియైన శ్రీమాత దివ్యానుగ్రహముతో.. శక్తి యుక్తులను, ఆయువు ఆరోగ్యము లను, సకల విజయములను పొందుచున్నాము!
  శివమస్తు! శ్రీరస్తు!
    ⚜️తేట గీతి పద్యము⚜️
    పాడి పంటలు వృద్ధిగ పండ వలయు,
     విద్య వాణిజ్య నుద్యోగ విత్త ములును
     ఆయు రారోగ్య మైశ్వర్య మనవరతము
      విజయ మొసగాలి యన్నింట, విజయ దశమి!
            
      ( డా. మహ్మద్ షరీఫ్.,)

కామెంట్‌లు