సౌభాగ్యకేళి; -డా.రామక కృష్ణమూర్తి--చరవాణి:9948285353

 తెలుగు లోగిళ్ళలో ఆడపిల్లల సందడి
సౌభాగ్యవతుల వ్రతానుష్ఠానం
ఉయ్యాలలూగే ఆహ్లాదం
అట్లతద్ది నాటి ఆనందం
అమ్మవారికి నైవేద్యం
వాయినాల ఆచారం
పేరంటాల సంరంభం
గోరింటాకుల ప్రకాశం
శుభకామనలకు శ్రీకారం
సరదాలకు ఆలవాలం
సంప్రదాయాల కోలాహలం
భక్తి,శ్రద్ధలతో ఆచరణం
పెద్దల ఆశీస్సుల భాగ్యం
పిన్నల కేరింతల వినోదం
స్త్రీల శోభాయమానం
అట్లతద్ది చిరస్మరణీయం.
కామెంట్‌లు