సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 మితము...మిథము
   *****
మితము,మిథము... ఈ రెండూ జీవితాన్ని నడిపించే వాహకాలు.
మితము ఎప్పుడూ హితమే.అది ఆరోగ్యపరంగా,మాటలపరంగా, ఆర్థికంగా అయినా...
అపరిమితం అనర్ధ హేతువు. మితం దాటితే మనసూ, మనిషీ బాధలకు గురయ్యే పరిస్థితులు ఎదురవ్వొచ్చు.
'అతి సర్వత్ర వర్జయేత్' అన్న మాట గమనంలో ఉంచుకోవాలి.
ఉన్నంతలో "పరిమితి" దాటకుండా "మట్టసం"గా మనసు 'కట్టు' తప్పకుండా 'మప్పితం'గా బతకడంలోనే వ్యక్తి ఎలాంటి జీవన విధానం గలవాడో అంచనా వేయవచ్చు. 
మితమే కాదు మిథముగా కూడా జీవించాలి.
మిథము అంటే పరస్పరము, అన్యోన్యము, ఇతరేతరము, ఒండొరువుడు,ఒండొరుడు.. ఇలా అర్థాలు ఉన్నాయి.
సమాజాన్ని కుటుంబంగా భావిస్తూ పరస్పరం గౌరవించుకుంటూ అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగించాలి. తమ పరిమితులు దాటకుండా ఎవరి హద్దుల్లో వారు ఉన్నప్పుడే ఆనందం వెల్లివిరుస్తుంది
అలా కలిసి మెలిసి ఉన్న కుటుంబాలు కానీ, సమాజం కానీ ఎలాంటి ఒత్తిడి, విభేదాల పొడ సోకకుండా  ప్రశాంతంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు