అమ్మ అనుసరించాలి;-డా.నీలం స్వాతి, చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.

 నిద్రాహారభయాదులు మానవ  సహజములని చిన్నయ్య సూరి చెప్పిన వాక్యం. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి  నిద్రపోయేంత వరకు చేయవలసిన పనుల గురించి మన పెద్ద వాళ్ళు ఏం చెప్పారు మనం ఏం చేస్తున్నాం మనల్ని మనం ఒక్కసారి పరామర్శించు కుంటే మనమంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. ఉదయం లేవగానే మంచి నీరు తాగి చెంబుతో నీళ్ళు తీసుకొని  దాదాపు మైలు మైలున్నర  దూరం  తమ గ్రామానికి  దూరంగా వెళ్లి కాలకృత్యాలు తీసుకుని  నది గానీ, సముద్రం గానీ, కాలువ గానీ ఉంటే అక్కడ గాయత్రి మంత్రం చదవాలి ఆ మంత్రం 24 అక్షరాల సమన్వయం ఒక్కో అక్షరానికి ఒక్కో ఆసనం వేస్తూ దానిని ఆచరించాలి. దాని వల్ల శరీరానికి కావల్సిన ఆరోగ్యం  మనకు వస్తుంది. అప్పటివరకు చెమటతో నిండి ఉన్న శరీరాన్ని  శుభ్రం చేయటానికి నదిలో దిగి ఈత వచ్చినవాళ్లు ఈత కొట్టుకుంటూ, ఈత రాని వాళ్ళు  పూర్తిగా స్నానం చేసి  సూర్యుడు ఉదయిస్తున్న శుభముహూర్తంలో  దోసిలి నిండా నీళ్లు తీసుకుని సూర్యభగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి ఆ లేత సూర్యకిరణాలు ఆ దోసిలిలో వున్న నీటి పై పడి వక్రీకరణ చెంది కంటికి చేరతాయి దానితో కంటికి ఉన్న రుగ్మతలు తగ్గిపోతాయి. వీరు వేసిన 24 ఆసనాలలో కంటికి వ్యాయామం లేదు. దీని ద్వారా  వ్యాయామం దొరుకుతుంది తిరిగి ఇంటికి నడిచి వెళ్లి  తన కార్యక్రమాలలో నిమగ్నమైన వారు ఎలాంటి అలసట లేకుండా చక్కగా కార్యక్రమాలు చేసుకోగలుగుతారు. రాత్రి చక్కటి నిద్ర పడుతుంది  ఆరోగ్యం సిద్ధిస్తుంది.  మానవుని జీవితం వంద సంవత్సరాలు అన్న సూక్తిని నిజం చేసినవారవుతారు.
మరి తల్లులు  తమ బిడ్డలు నిండు నూరేళ్ళు హాయిగా ప్రశాంతంగా ఆరోగ్యకరంగా  పెరిగి పేరుప్రఖ్యాతులు తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పిన విషయాలను మీరు  ఆచరిస్తే చాలు  మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అన్న విషయాన్ని మాత్రం మరిచిపోకండి....సరేనా
కామెంట్‌లు