సుప్రభాత కవిత ; -బృంద
ప్రభాతవేళ లో  విరిసే
పారిజాతం కోసం
నీలి నింగిలో నారింజరంగులు
నింపిన వెలుగురేఖలు

ఆవరించిన అరుణారుణ 
కిరణాల అందాల
సందోహం అవలోకించే
అవనీ గగనాలు.

తూరుపు వీణియ  మీటిన
ఉదయరాగం
అందిపుచ్చుకున్న
మలయమారుతం...

అందరికీ అందించే మిషతో
ఝరులూ గిరులూ తిరిగి
పుడమిపైని తరువు తీగలను పలకరిస్తున్న తరుణం

మురిపాలు నింపి
ముచ్చటగ వ్రాసిన
మబ్బుల ప్రేమలేఖను
అందుకున్న శిఖరాలు

అమృతతుల్యంగా మార్చి
జలపాతాల ద్వారా....
కడలికి పంపే
సుందర దృశ్యం ....

జలజల జారుతూ
గలగలా నవ్వుతూ దాన్ని
సాగరుడికి అందివ్వాలని
పరుగుతీసే సంతోషం.

అలవాటుగాఅలవోకగా 
జలధరాల సందేశం
జలధారలుగా  సంద్రం 
చేరుకునే కమనీయ
దృశ్యం.


ప్రకృతిలో దాగిన 
అందాల విందును
ఆవిష్కరించే  ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు