కొత్త ఒకవింత-పాత ఒకరోత;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కొత్త వింతయ్యింది
పాత రోతయ్యింది
పాతది మోటయ్యింది
కొత్తది నాజూకయ్యింది

అప్పటి తెలుగేది
అప్పటి వెలుగేది
అప్పటి పలుకులేవి
అప్పటి కులుకులేవి

అప్పటి పంచలేవి
అప్పటి చీరలేవి
అప్పటి బొట్టులేవి
అప్పటి జడలేవి

అప్పటి ఆచారాలేవి
అప్పటి కట్టబాటులేవి
అప్పటి కాణీలేవి
అప్పటి అణాలేవి

అప్పటి వీరపుత్రులేరి
అప్పటి నారీమణులేరి
అప్పటి మణులేవి
అప్పటి మాణిక్యాలేవి

అప్పటి నవ్వులేవి
అప్పటి మోములేవి
అప్పటి అందాలేవి
అప్పటి ఆనందాలేవి

అప్పటి కవులేరి
అప్పటి కవితలేవి
అప్పటి కలాలేవి
అప్పటి గళాలేవి

అప్పటి గురువులేరి
అప్పటి పాఠాలేవి
అప్పటి పురాణాలేవి
అప్పటి కావ్యాలేవి

అప్పటి బోధనలేవి
అప్పటి బుద్ధులేవి
అప్పటి భక్తులేరి
అప్పటి భజనలేవి

అప్పటి నాటకాలేవి
అప్పటి ప్రేక్షకులేరి
అప్పటి హరికథలేవి
అప్పటి బుర్రకథలేవి

అప్పటి పద్యాలేవి
అప్పటి గద్యాలేవి
అప్పటి జేజేలేవి
అప్పటి చప్పట్లేవి

అప్పటి బంధాలేవి
అప్పటి త్యాగాలేవి
అప్పటి వినయములేవి
అప్పటి విధేయతలేవి

అప్పటి పాలకులేరి
అప్పటి సేవకులేరి
అప్పటి విలువలేవి
అప్పటి మర్యాదలేవి

కొత్తనీరు వచ్చింది
పాతనీరు కొట్టుకపోయింది
పడమటిపద్ధతి వచ్చింది
పురాణసంస్కృతి పోయింది


కామెంట్‌లు