ఎన్నిక! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆఊరి గ్రామాధికారి కి మంచి సహాయకుడు కావాల్సి వచ్చాడు.నీతి నిజాయితీ పాపభీతి కలవాడు కావాలి.ముగ్గురు యువకులు ముందు కి వచ్చారు.వారిలో ఎవరిని ఎన్నిక చేయాలో తోచలేదు.భార్య ఓ సలహా ఇచ్చింది"ఏమండీ!ఆముగ్గురినీ భోజనానికి పిలవండి.దాన్ని బట్టి వారి గుణగణాలు నిర్ణయిద్దాం." అలాగే వారిని ఆహ్వానించాడు.వరండాలో కంచాలు గ్లాసులు పెట్టాడు.ఇద్దరు కుర్రాళ్ళు సరాసరి దర్జాగా బిల్లు పై కూచున్నా రు.మూడోవాడు శివ బకెట్ లోని నీటితో కాళ్లు కడుక్కొని కంచాలు గ్లాసులు అందరికీ బిల్లుపై అమర్చి గ్లాసుల్లో నీరు పోశాడు.మిగతా ఇద్దరూ బుద్ధావతారంలాగా శివ వంక చూస్తూ కూర్చున్నారు.వడ్డన ప్రారంభం అయింది.మొదటి ఇద్దరూ కోడి కెలికినట్లు కింద మీద మెతుకులు పడేస్తూ తింటే శివ శుభ్రంగా కంచంలో ఏదీ వదిలి పారేయకుండా తిని ఆకంచాన్ని దొడ్లో అంట్లు తోమే చోట పెట్టాడు.మిగతా ఇద్దరూ బ్రేవ్ మని త్రేన్పుతూ లేచారు. శివా ఆనందానికి ఎన్నిక ఐనాడని చెప్పి నవసరం లేదు కదా!
కామెంట్‌లు