సుప్రభాత కవిత ; -బృంద
కదిలిపోవు నీటిలో
చెదిరిపోని గుర్తులు

సాగిపోవు కాలంలో
మరువలేని తలపులు

చీకటి మూసిన ఏకాంతంలో
చిరు పలకరింపే  జీవం..

అగమ్య గోచరమైన క్షణాన
అందే చిరు వెలుగు 

ఇచ్చే ధైర్యం...పోసే ప్రాణం
నింపే విశ్వాసం  
నిలిపే నమ్మకం

మనసుకు బుధ్ధి తోడైతే
అడుగుకు  బలం

అడుగులు వడిగా పడితే
చేరువ కాదా గమ్యం?

చల్లగ చూసే దైవం
చేయందుకునే సాయం

కలతల బాట తరుగు
వెలుగుల తోట తెలియు

మొక్కవోని పట్టుదలే
చక్కని  చుక్కాని జీవితానికి

కిరణం చూపే  గమ్యం వేపు
వేకువ తెచ్చిన ఉత్సాహంతో

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు