అక్షరయజ్ఞం;-కొప్పరపు తాయారు.
 అ: అమ్మ నను కొట్టకమ్మా అల్లరినిక
     సేయ నమ్మా,,!
ఆ: ఆటవిడుపు కాదమ్మా అ ఆ లు
     చదివెదను.
ఇ: ఇంటిలోనే వుందు నమ్మ.
ఈ: ఈల పాట రాదమ్మా
ఉ: ఉచితమంటే ఏమిటమ్మా!
ఊ: ఊయలలో ఊగెదమ్మ
      జోలపాట పాడమ్మా!
ఋ: ఋషులకి దండం
        పెడతానమ్మ! 
ఎ: ఎండలో తిరుగనమ్మా !
ఏ: ఏనుగంటె ఇష్టమమ్మా !
ఐ : ఐకమత్యంగా వుంటామమ్మా!ఒ : ఒంటరిని కాదమ్మా !
ఓ : ఓర్పుకలిగి వుందునమ్మా!
ఔ : ఔనంటే కాదననమ్మా !     
అం:అందరం ఒకటే నమ్మా !
అః :అ హా హాని నవ్వు తాను!
క   :కలహాలు వద్దన్నావు!
ఖ. :ఖరమంటే గాడిద కదమ్మా!
గ   :గణపతిని పూజిస్తానమ్మా!
ఘ : ఘఠమంటే కుండ కదమ్మా!
చ. :చదువుల తల్లికి
      నమస్కరిస్తానమ్మా !
ఛ  :ఛత్ర మంటే గొడుగు    
      కదమ్మా !
జ. :జలమన్న నీరు కదమ్మా !
ఝ : ఝరీ అంటే సెలయేరమ్మా! 
ట  : టపాకాయలు నా కిష్టం  ,!
ఠ  : శివుడు నీలకంఠుడు కదమ్మా
డ  : డమరుకం శివుడికి
       ఇష్టమన్నావు!
ఢ : ఢంకా వాయిస్తున్నారమ్మా !
ణ : వీణ అంటే ఇస్టమమ్మా ! 
త : తల్లి దండ్రులు దైవాలమ్మా !
థ  : కథలు నాకు చెప్పమ్మా !
ద  : దండోరా  విన్నా నమ్మా !
ధ  : ధనమంటే డబ్బు కాదమ్మా ,!
న  : నలుగురిలో పక పక
       నవ్వనమ్మా !
ప  : పలక పైన రాసెదమ్మా !
ఫ  : ఫలములు తిందునమ్మా !
బ  : బడికి చక్కగ పోయెదనమ్మా !
భ  : భరతదేశం  నా దమ్మా!
మ : మంచితనం మనదమ్మా  !
య : యమున ఒక నది అమ్మా !
ర    : రంగుల హరివిల్లమ్మా  !
ల   : లవణమంటే ఉప్పమ్మా !
వ   : వల చేపలకమ్మా !
శ    : శరము అంటే భాణమమ్మా !
ష    : షణ్ముఖుడు సుబ్రహ్మణ్యుడే !
 స.  : సరదాగ వుందునమ్మా  !
 హ  : హరి అంటే విష్ణువు కదమ్మా !
ళ    : కళలకు పుట్టినిల్లు మనదేశం
         కదమ్మా!
 క్ష    : క్షమ మూలధనం
         మన కమ్మా!
ఱ   : ఱoపం అంటే తెలుసమ్మా  !
జ్ఞ.   : జ్ఞానo అంటే తెలివి 
         కదమ్మా !
కొప్పరపు తాయారు.              .                
17/462,B3,N.V.R.St
నెహ్రు నగర్ 
మదనపల్లె,అన్నమయ్య జిల్లా
పిన్: 517325
పోన్:9440460797 

కామెంట్‌లు