సుప్రభాత కవిత ;=బృంద
వేదనల  చీకటిని
వెలుగులతో నింపే వేకువ

కలల  చిత్రాన్ని
కనుల ముందు నిలిపే వేకువ

రాలిన ఆకు స్థానే
కొత్త చిగురు  నింపే వేకువ

వేసారిన వేసవిలో
వసంతం నింపే వేకువ

లేత ఎండల  కిరణాలతో
సేద తీర్చే నులివెచ్చని వేకువ

తీగను విడిచిన రాగమాలిక
పూలను చేరి మురిసే వేకువ

రాలిన ఆశల ఆకులను
కౌగిలించుకున్న కాంతిరేఖల వేకువ

మురిపించే ముచ్చట్లతో
మురిసే మనుగడ తెచ్చే వేకువ

మూగబోయిన మది మూలల
వెలుతురు వేణువూదే వేకువ

వెల్లువైన వెలుగుల
తడిసి మురిసే  వేకువ

కొత్త వెలుగులు కోటారుగా
తెచ్చే  వెలుగుల  వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు