అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా
====================================
ఆడపిల్ల సబల
అంటూ ప్రసంగం
అబలను చేయ
విశ్వప్రయత్నం
2 ఆమె జననం
జగతికి ఆయువు
పుట్టనివ్వని కర్కశం
లోకానిది
3.అమృతపు సంద్రం
ఆమె మది
మనసుతో పనిలేదు
మృగాళ్ళకు
4.ఆటబోమ్మని
ఆడుకొన చూడకు
తెగువలో
శివంగి తను
5.ఆమె నవ్వితే
ముత్యాల జల్లు
ఆమె కన్నీరు
లోకానికి కార్చిచ్చు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి