సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 వితతము... వితథము
*******
ఎవరి కోసమో కాకుండా, మనకు మనంగా మంచితనం,మానవత్వం,సౌశీల్యంతో పరోపకార తత్వంతో జీవించాలి. ఆ సుగుణమే మనకు తెలియకుండానే చుట్టూ ఉన్న సమాజంలో వితతం అవుతుంది.
వితతం అంటే వ్యాప్తి.ఇంకా ప్రచారం, ప్రసారం, ప్రాచుర్యం, విస్తరణ లాంటి అర్థాలు కూడా ఉన్నాయి.
తరువులా బతకాలి.తన గురించి చెప్పుకోదు ప్రాణ వాయువు,పండ్లూ పూలనిస్తూ ,తన నీడలో సేద తీరేలా చేస్తుంది.
వితతము కోసం వితథమును ఎప్పుడూ ఆశ్రయించవద్దు.
వితథముతో కూడిన బతుకును ఎవ్వరూ హర్షించరు.
వితథము అంటే ఏమిటో అర్థమై వుంటుంది ఈ పాటికి...
వితథము అంటే అసత్యం,అబద్ధం,మిథ్య,అనృతం,కల్ల, బూటకం లాంటి చాలా అర్థాలున్నాయి.
 అందుకే " కనికల్ల నిజము తెలిసిన మనుజుడె పో నీతి పరుడు మహిలో సుమతీ" అన్నాడా శతక కర్త.
అందుకే వితథాన్ని వీడాలి.నీతీ నిజాయితీగా బతకాలి.
అప్పుడే ఓ మంచి వ్యక్తిగా  వితతము అవుతాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు