ఉండాలోయ్!;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
బాబూ పాపా
పిల్లల మంతా ఆటలు ఆడుతు 
ఉండాలోయ్ ఉండాలీ
బాబు పాపా 
పిల్లలమంతా పాటలు పాడుతు
ఉండాలోయ్ ఉండాలీ

బాబూ పాపా
పిల్లలమంతా కలిసీమెలిసీ
ఉండాలోయ్ ఉండాలీ

బాబూ పాపా
పిల్లలమంతా ఆనందంగా
ఉండాలోయ్ ఉండాలీ

బాబూ పాపా
పిల్లలమంతా క్రమశిక్షణతో 
ఉండాలోయ్ ఉండాలీ

బాబూ పాపా
పిల్లలమంతా మొక్కలు నాటుతు 
ఉండాలోయ్ ఉండాలీ

బాబూ పాపా
పిల్లలమంతా పెద్దలు చెప్పినట్లుగా 
ఉండాలోయ్ ఉండాలీ

బాబూ పాపా
పిల్లలమంతా గురువులపట్ల గౌరవంతొ
ఉండాలోయ్ ఉండాలీ

బాబూ పాపా
పిల్లలమంతా జీవులపట్ల ప్రేమతొ
ఉండాలోయ్ ఉండాలీ

బాబూ పాపా
పిల్లలమంతా అందరితో సఖ్యతగా
ఉండాలోయ్ ఉండాలీ !!


కామెంట్‌లు