మనుగడ ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఉరుముల మెరుపుల సవ్వడిరా 
ఉప్పెనగాలి మోతలురా
వేసవి గాడ్పుల వేడిమిరా 
చండ్రనిప్పుల ఉక్కపోతరా
మంచు గడ్డలా చలిచలిరా
గజగజ వణికే తీరేరా
మూడు కాలముల తీరిదిరా
దేవుడు చేసిన ప్రకృతిరా
వాన చలి ఎండ
అవే గదా మనకు అండ
ఇవేగనుక లేకపోతే
ప్రాణుల మనుగడ లేదు కదా!!

కామెంట్‌లు