@ ఫ్యాషన్ ముదిరి @ కోరాడ నరసింహా రావు !
పిచ్చి కుదిరింది... రోకలి ని... 
 తలకు చుట్టమన్నట్టు..., 
 ఫ్యాషన్  ముదిరి... వికారం 
 తలకెక్కింది... !

క్లబ్బులు - పబ్బులు... 
 మాదకద్రవ్యాలమత్తూ...! 
 పవిత్రమైన శీలం పోయినా... 
 పదిరూపాయల నోటు 
 పోయినంత నిర్లక్ష్యం !!

నిర్వీర్యమై  నిస్తేజంగా ...       
  రోడ్డున పడ్డ యువత !
   తనముష్టికి పోటీ యనుకుని 
  బికారిసైతం భయపడినటుల 

 విజ్ఞానం వెన్నెల విహారం 
   చేయిస్తున్నా...అవివేకం.. .
  అంధకారంలోకి 
    ఈడ్చుకు పోతోంది...!!
    ******

కామెంట్‌లు