భారం!;-- యామిజాల జగదీశ్
 ఆ పిల్లకు పది పన్నెండేళ్ళు మించి ఉండదు. బస్సు కోసం నిరీక్షిస్తున్న వారిలో ఆ పిల్ల కూడా ఒకరు. 
ఓ అబ్బాయిని ఎత్తుకు నిల్చుంది. 
బస్సు రాక చాలా సేపైంది. 
అయినా ఆ పిల్ల ఎత్తుకున్న ఆ పిల్లాడిని కిందకు దించలేదు.
ఉండబట్టలేక "అమ్మాయ్...ఎత్తుకున్న ఆ పిల్లాడిని కిందకు దించొచ్చుగా. బస్సు వచ్చినప్పుడు ఎత్తుకో. ఎంతసేపని ఆ భారాన్ని మోస్తావు పాపం..." అని అనగానే ఆ పిల్ల చెప్పిన జవాబు చెంప మీద దెబ్బేసినట్టయింది.  
"భారమేంటీ? వాడు నా తమ్ముడు"

కామెంట్‌లు