దుష్ట స్వభావం!అచ్యుతుని రాజ్యశ్రీ

 టీచర్ పాఠం చెప్తూ తోటి ప్రాణుల్ని ప్రేమించాలని ఒకరికి మనసా వాచా కర్మణా అపకారం తలపెట్టరాదని చెప్పింది.చేతైతే సాయంచేయాలి లేదా గమ్ న ఉండాలి. కానీ నేడు మనిషి ని  మనిషి దోచుకునే ద్రోహబుద్ధి ఉపకారికి అపకారం చేసే దుర్బుద్ధి పెరిగింది. ఉత్తముడు రాజుగారి కోటలో ఏదైనా నౌకరీ దొరుకుతుందేమో అని బైలుదేరాడు.దారిలో అలిసిపోయి చెట్టుకింద పడుకున్నాడు.కాస్త దూరంలో ఎముకల పోగులు  తళతళ మెరుస్తున్న కొన్ని చిన్న నగలు కన్పడ్డాయి.అవి ఎవో రాకుమారుడివి అని  గుర్తించాడు.అందుకే ఆనగలని ఓమూటగా ఎముకలని ఇంకో మూటగా కట్టి తన లోపలి బనీను జేబులో దాచాడు.ఆపై ఓ ఎద్దులబండీ కనిపిస్తే దాన్ని ఎక్కాడు.బండీవాడు మహాటక్కుటమారి! దారిలో ఎందరినో మోసం చేస్తూ మాయమాటలతో వారి దగ్గర ఉంది గుంజుకునేవాడు.ఉత్తముడు అమాయకుడు అని గ్రహించాడు.మాటల్లో పెట్టాడు. తనదగ్గిర ఉన్న మూటల విషయం చెప్పాడు.
అంతే!ఉత్తమునికి శిక్ష వేయించి తను రాజుదగ్గర కొలువుసంపాదించాలి అనే దురాశ మొదలైంది.వాడు బాటసారులను మోసగించే పెద్ద గజదొంగ! అందుకే  రాజాస్థానంలోకి ఉత్తమునితో వెళ్లాడు. వినయవిధేయతలతో ఉన్న ఉత్తమునికి రాజు వెంటనే ఉద్యోగం ఇచ్చాడు.కుళ్ళుబోతు బండీవాడు అన్నాడు "ప్రభూ! వీడిని తనిఖీ చేయండి. "అలాగే  భటులు తనిఖీ చేస్తే ఆరెండు మూటలు కనపడ్డాయి. ఉత్తముడు అన్నాడు "ఈబండీవాడు మోసకారి దారికాచి దోచుకునే దొంగ ప్రభూ! వీడి బండీలో ఆజంపఖానా కింద వాడుదాచిన నగలు ధనం ఉన్నాయి.నేను సత్యపురం నివాసిని! బండివాడు ఆచెట్టుకి దూరం గా ఉన్న పొదల్లోంచి కొన్ని చిన్న సంచులు బండి లో పెట్టాడు. దానిసంగతి తేల్చుకోవాలని నేను వాడితో మంచి గా మాట్లాడాను.లేకుంటే నన్ను సఫా చేస్తాడు కదా?" రాజు  బండీని తనిఖీ చేయించి వాడే దొంగ అని  రాకుమారుడిని చంపి నగలు కాజేశాడని తెలుసు కున్నాడు.అంతే ఉరిశిక్ష విధించాడు" టీచర్ ఈకథ చెప్పి అంది"రోడ్ పైన ఏదైనా పర్సు  హాండ్ బ్యాగ్ కన్పడితే వెంటనే  ఆప్రాంతంలోని పెద్దలకి అప్పగించాలి.లేదా స్కూల్ లో ఇవ్వాలి. పోలీసులకి ఫోన్ చేసి చెప్పాలి. పెద్దవి ఐతే ముట్ట రాదు.అందులో  పేలుడు పదార్ధాలు ఉంటాయి. "సరే టీచర్ అన్నారు పిల్లలంతా!"కొత్త వారికి మీవివరాలు చెప్పరాదు.నలుగురితో కలిసి వెళ్లాలి .అమ్మా నాన్నకు చెప్పకుండా  వెళ్లరాదు". ఇంటి బెల్ మోగింది🌹
కామెంట్‌లు