కవి నాశబోయిన నరసింహ(నాన)కు యాదాద్రిలో ఘనంగా సన్మానం:

 ఐ.ఎస్.ఓ.గుర్తింపు పొందిన శ్రీశ్రీ కళా వేదిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం  యాదగిరి గుట్టలో నిర్వహించిన జాతీయ శతాధిక కవి సమ్మేళనం "యాదాద్రి కవితోత్సవంలో "నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన కవి, రచయిత,ఆరోగ్య పర్యవేక్షకుడు నాశబోయిన నరసింహ(నాన)ను ఘనంగా సన్మానించారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను ఖండిస్తూ తాను రాసిన గజల్ లహరి అక్షర కవితా గానం చేసినందుకు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్,సాహిత్య భూషణ్ డా.కత్తిమండ ప్రదీప్,బోయి భీమన్న సాహితీ నిధి ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి బోయి హైమావతి భీమన్న,కొల్లి రమావతి, జి.రసం.యాదాద్రి అధ్యక్షుడు డా.పోరెడ్డి రంగయ్య, ఉమా సత్యం గజం, కొంపల్లి నేతాజీ,  ప్రముఖుల చేతుల మీదుగా నాశబోయిన నరసింహ (నాన)ని శాలువా,మెమెంటో, ప్రశంసా పత్రం,పూల మాలలతో ఘనంగా సత్కరించారు.
కామెంట్‌లు