విలువ! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు చిన్న కుందేళ్లు బాగా గాయపడ్డాయి.ఎవరో గడ్డిపొదల్లో ముళ్ళు పెట్టి దానిపై కారెట్ ఇంకా ఎన్నో కూరముక్కలు వేశారు. అవి తింటానికివెళ్లిన కుందేళ్ల ఒళ్లు అంతా గీరుకుపోవటమే గాక మూతి అంతా గాయాలయ్యాయి. లబోదిబో అని ఏడుస్తూ అవి బైటకి దూకాయి.తాబేలు అంది"స్పీడ్ గా వేగంగా పరుగులు తీస్తామనే గర్వం మీకు!అందుకే పరుగుల పందెం లో మా ముత్తాత తో మీముత్తాత ఓడాడు." "హూ!నీలా గంటకో అడుగేస్తే వేటగాడి చేత చిక్కుతాం! నీవంటే నీటిలో ఉంటావు.నీపైన గట్టి డిప్ప ఉంది. కానీ నీపొట్ట మెత్త మెత్తగా ఉంది. అక్కడ కాలుపెట్టి నిన్ను నక్క పీక్కుతింటుంది." ఇంతలో కోతి అంది" పాములు సరసరా పాకుతాయి కదా!?ఐనా విషప్రాణులని తెలిసికూడా మనిషి వాటిని పట్టి చర్మం వలిచి పర్సులు బెల్టులు తయారు చేస్తున్నాడు.వాటి ఖరీదు కూడా  చాలా ఎక్కువ!" ఉడత ఉక్రోషం తో అంది"చిరుత పులులను ఇతర జంతువులను విదేశాలనుంచి తెప్పించుకుని వాటిని నేషనల్ పార్కులో వదిలి ఎంచక్కా  తిండి సంరక్షణ చేస్తూ మనల్ని మాత్రం  చంపుతాడు". అప్పుడు కోతి అంది" మన జనాభా ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడ కనపడతాము.ఆహారం దొరక్క మేము హైదరాబాద్ నగరంలో కాలనీల్లోకి  ఇళ్ల లోకి చొరబడుతూనే ఉన్నాము. కుక్కల బెడద కూడా ఎక్కువ ఐంది. ఒక విషయం గమనించండి. ఎవరి విలువ వారిదే! మనుషులు కూడా  తమ అధికార హోదా  డబ్బు  వలన జనం జేజేలు పలుకుతారు.మంత్రి ప్రధాని ఇంకా  ఇతర వి.ఐ.పి.లకు సెక్యూరిటీ వారి వెంట పరుగులు తీస్తూ  సెక్యూరిటీ ఆఫీసర్లు మనకు  కనపడతారు.వారికి భద్రత ఎక్కువ. ఏదేశంలో నైనా సరే విలువ ఇస్తారు వారి గొప్పతనం హోదా కి తగ్గట్లుగా!చిరుతపులి కనుమరుగైన పరిస్థితి! అందుకే క్రూరమృగాలపై పర్యావరణ పరిరక్షణ కై దేశాలు కృషి చేస్తున్నాయి.మనిషి జనాభా తెగ పెరిగిపోయింది. మనిషి కి విలువ తగ్గింది. కోతుల్లో కొన్ని కోతుల సంరక్షణ చేస్తున్నారు.రామచిలుక కున్నవిలువ నేడు పావురాలకులేదు". అన్ని జంతువులు ఆలోచన లో పడ్డాయి.తమ జనాభా తగ్గితే తమవిలువ కూడా పెరుగుతుందని గ్రహించాయి🌹
కామెంట్‌లు