తనదాకా వస్తే! అచ్యుతుని రాజ్యశ్రీ

 "బంగారు తల్లీ!కాస్త మంచినీళ్ళు ఇవ్వు"ఆయాసపడుతూ మంచంలో పడుకున్న బామ్మ మాటలకి విసుక్కుంది జయ."ఆరాగిచెంబు నిండా పెట్టాగా బామ్మా! గ్లాసు లోకి  వంపుకుని తాగు." ఆరుంబాకా నోరెత్తి అరిచింది."నాచేతికి బలంలేదే పిల్లా!80దాటాయి.దేవుడు నన్నెప్పుడు తీసుకుపోతాడో?"బాధగా గొణిగింది.చెంబు మోసే శక్తి లేదు. తల్లి మాటవిని కాలు ఈడుస్తూ శివ వచ్చి మంచి నీరు కొంచెం గ్లాసులో పోసి "అమ్మా!తాగు. మళ్ళీ కావాలంటే పోస్తా"అన్నాడు."నాయనా ! కాలికిదెబ్బ తగిలి కట్టుతో ఉన్న  కాలు ఈడ్చుకుంటూ ఎందుకు వచ్చావు శివా?" "చూడమ్మా !నేనింకా 40ఏళ్ళ వాడినే! చిన్న దెబ్బే కదమ్మా!రేపు నేను ముసలాడినయ్యాక దేవుడే చేస్తాడమ్మా సాయం.ఇవాళ నేను నీకు చేస్తే  రేపు నాపిల్లలు చేస్తారు. "కొడుకు మాటలకి నీరసంగా నిరాశగా నవ్వింది. "జయా! రేపు మాకు నీవేగతి" అన్నాడు. శివా భార్యకి కూతుర్ని ఆల్రౌండర్ చేయాలని ఉబలాటం!పదేళ్ళ జయ కాస్త పెంకిపిల్ల! డాన్స్ సంగీతం బడి చదువుతో ఆపిల్ల ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తన కూతురు  ఓసెలబ్రిటీగా టి.వి.లో కనపడితే చూడాలని ఆమె ఆశ!"జయా!నేను ఓకథ చెప్తా విను.నక్క మహాటక్కుటమారి కదా! అది ముసలిది కావటంతో నోర్ముసుకుని ఓమూల పడుంది.దాని కొడుకు "నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు  తయారైనాడు."నాయనా!నేను అందరితో గిల్లి కజ్జాలు పెట్టుకుని తంపులు పెట్టి  విరోధిగా మారాను.అందుకే ఎవరూ నన్ను పలకరించరు."అంది.ఆచిన్న నక్క  తల్లి మాట పెడచెవిన పెట్టింది.తల్లి కి దూరం గా పారిపోయింది.వేటకుక్కలు రెండు దాన్ని గాయపర్చి అన్నాయి"మాఊరి లో కాలుపెట్టి  కోడిపిల్లల్ని  ఎత్తికెళ్లావంటే చంపేస్తాం."అంతే తల్లి నక్క దగ్గరకు వచ్చి  భోరుమని ఏడ్చింది.జయా!ఈకథవల్ల నీకేం తెలిసింది?"తండ్రి ప్రశ్నకు అంది"నాన్నా!పెద్దలమాట వినాలి.ముసలివారిని విసుక్కోరాదు". అని!🌹
కామెంట్‌లు