వృద్ధాప్యం లేని ఊరు!!?; - ప్రతాప్ కౌటిళ్యా (ప్రతాప్ రెడ్డి.కె.)
పదహారేళ్ల పడుచు నది
నేలను తడిపి
పడి పడి లేచే కెరడమై
సముద్రం ఒడిలో పడిపోయింది!!

తిలగం దిద్దిన కుంకుమపువ్వు
మంచు పర్వతం నుదుట పాదం మోపింది
హిమం ఎదలో ఏదో అలజడి
అలవోకగా ఈదుతున్న హంస కోసం
ఆకాశం భూమికి దిగింది
మానస సరోవరం హారమై ఆహ్వానించింది!!

రంగురంగుల తోటల్లో
సీతాకోకచిలుకలు వాలుతున్న వేళ
పూలన్నీ పచ్చని చిలుకలై
జంటగా ముచ్చట్లాడుకుంటున్నవీ!!!

మధురమైన మకరందం తాగిన తుమ్మెదలు
అష్టదిక్పాలకుల ద్వారాల్లో
పరిమళాలైవీస్తున్నవి!!
ఎదురేగిన గాలి హృదయం
గంధర్వుల గానమై వీచింది!!!

పచ్చని చేలల్లో
చల్లనిపల్లె ప్రియురాలిలా
మయూరమై మనసును దోచేస్తుంది!!

మట్టిని కౌగిలించుకుంటే
విత్తనం మొలకెత్తాలి కానీ
రాలిన పండుటాకుల
మట్టిలో కలిసిపోయే జ్ఞాపకంలా ఉండకూడదు!!!?

ఆకలి మంటలు ఆర్పే
అజ్ఞాత వీరులు పైరులు
అన్నం మెతుకులు కత్తుల కాకుండా
మెత్తని అమ్మ పొత్తిళ్ల లా

భూదేవి కడుపున పుట్టిన
కమ్మని పేరు
అన్నం ముద్ద ఒక ఆయుధం కాదా!!?

పక్షులన్నీ ఎగర లేవు
గాలి ఎగిరి ఎగిరి
పక్షుల పల్లె పల్లెలా ఇళ్లల్లో కావలి కాస్తుంది
ఏమాత్రం సవ్వడిచేసిన
ఆలు మగళ్ళలా కలిసిపోతాయి!!?

తెల్లని గోవు పాలల్లా
మేఘాలన్నీ కన్నె పిల్లలకు కన్ను గీటీ
చల్లని నీటితో ఒళ్లంతా తడిపేస్తుంటే
వివస్త్రలైతే వారిపర్వం కాపాడింది
పర్వతాలే కదా!!?

కలువలు కళ్ళు విప్పి చూస్తుంటే
చల్లని చూపులకు
జాబిల్లి చలించిపోయిందేమో
నెలవంకై నేలపై
కలువల్ల మారిపోయింది!!!

శాపవిమోచనం పొందిన వృక్షం
కల్పవృక్షం
రైతు వక్షస్థలంపై మొలిచింది!!?

ఆకాశాన్ని ఎగిరేసుకుపోయి
అడవిలో వదిలేస్తే
నక్షత్రాలన్నీ నేలకు దిగి
అడవి అంతా వెతుకుతున్నవి!!!

ఒక్క అవకాశం ఇమ్మని
మొక్క మొక్కని మొక్కుతున్నవీ!!

సూర్యాస్తమయాల మధ్య
ఒక ఊరు దాగుంది

తూర్పు పడమరలు పల్లెపడుచులు
ఉత్తరా దక్షిణలు 
పడుచు పిల్లల హృదయాలు!!

నాలుగు దిక్కుల పల్లెకు
పడుచు పిల్లలే దిక్కు!!

ఎప్పటికీ వృద్ధాప్యం లేని
హృదయం మా ఊరు!!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏

కామెంట్‌లు