* అనూ చానముగా...... ! *; -కోరాడ నరసింహారావు !
జనమే జయుని  సర్పయాగ ముతొ... వైరముపెరిగెను,     నరులకు...  నాగులకును.... ! 

 అదను చిక్కిన...కక్ష దీర్చు     కొను చుండిరి ఇరుసంతతులు! 
 
హింసలుపెరిగి,అశాంతి రగలగ
 నరునకును,నాగకన్యకకుపుట్టి న ఆస్తికముని కలుగజేసుకొని సంది చేయ యత్నించె... !

ఫలించెనాతని  ప్రయత్నము... 
కుదిరెను ఇరు సంతతులమధ్య 
సఖ్యము... !

ఆ శుభ దినమునే... 
  నాగుల చవితిగా... 
    పండుగచేసిరి మానవులు !

ఆనాటికి -  ఈనాటికి... 
  అనూచానముగా.... 
    ఆచరించు చుంటిమి... 
    ఈ నాగులచవితిని.... !!
   *******

కామెంట్‌లు