యువతకు గ్రహణంపట్టింది;- సత్యవాణి

గ్రహణం పట్టింది
అవును గ్రహణం పట్టింది
 సూర్యచంద్రులకేకాదు
మన యువతకు గ్రహణంపట్టింది
రాహువువంటి 
రాజకీయనాయకుల
కేతువు వంటి సినీమావాళ్ళ
వ్యామోహంలో చిక్కుకొన్న
యువతరమనే దేశఆశారేఖలైన కాంతిరేఖలకు గ్రహణం పట్టింది
తెలివిహీనతనే
చిమ్మచీకటిలో 
తనలోని శక్తిని మరచి
పట్టిన గ్రహణపు చీకటిలో
కొట్టుకొంటూంది యువత
గ్రణపు చీకటిలో
తప్పొప్పులు గ్రహించలేక
తన్నుకు చస్తోంది యువత
సూర్యచంద్రులకు పట్టే
రాహుకేతువులు గంటలసమయంలోనే విడిచిపెడతారు
యువతకు పట్టిన స్వార్థపు గ్రహణాలు
తమంతట తాము వదలవు యువశక్తిని
కళ్ళుండీ చూడలేని
చెవులుండీ వినలేని
మూర్ఖపు యువత
తమ భవితను మరచి
ప్రాణాలకు తెగించి
రాజకీయనాయకులనేవారూ
సినీమాయాక్టరులనేవారు
సృష్టించిన గ్రహణపు
చీకటినుండి
బయటపడలేరు
పడడానికి యిచ్చగించరు
చిమ్మచీకటిలో ఒకరితో ఒకరు
చెడుగుడు ఆడుతుంటారు 
చెడి పడిపోతుంటారు
      
కామెంట్‌లు