సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 పెరిమ...పెరిమె
  ******
పెరిమ గల హృదయం సౌజన్యం, సౌభాగ్యం, సౌహార్ధం, వాత్సల్యానికి  చిహ్నం.
మాటల్లో మమకారం ఒలకాలి, అభిమానం విరియాలి, మనసును ఆకట్టుకునే ప్రియత్వం కనిపించాలి.
మనసులో ఉన్న పెరిమ బంధాలను, అనుబంధాలను ఆప్యాయంగా కలిపి ఉంచుతుంది.పెరిమ అంటే ఈపాటికి అర్థమై వుంటుంది.
పెరిమ  అంటే ప్రేమ అనురాగం,కూర్మి, మమకారం,మక్కువ... ఇలా పై విధంగా చాలా అర్థాలున్నాయి.
అలాంటి పెరిమతో ఎదుటి హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుని పెరిమెతో మనుగడ సాగించాలి.
పెరిమె అంటే  గొప్ప తనం,గరిమ, మహత్వం,దొడ్డతనము, పెద్దఱికము ఇలా అనేక అర్థాలు కలవు.
 ఈ పెరిమెనే వ్యక్తి యొక్క గొప్పతనాన్ని, హుందాతనాన్ని తెలియజేస్తుంది.సాటి వారిలో గౌరవాన్ని పెంచుతుంది.
 పెరిమ,పెరిమె కలబోసిన వ్యక్తులుగా ఉన్నతంగా జీవిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు