బ్రతుకు ఎదురీతలో ఇద్దరు మహిళల కథ..!!------కుమార్.కూనపరాజు-- ఏలూరు.


 చాలారోజుల క్రితం fb లో ఓ ప్రకటన చూసాను. "అనాచ్ఛాదిత కథ" నవల ఆవిష్కరణ సభ గురించి. డిజైన్ చేసింది, బంగారు బ్రహ్మం. ఆయన కవర్ డిజైన్లు బాగుంటాయి. కేవలం ఈ అందమైన కవర్ కోసం ఆ సభకు వెళ్ళాను. ఈ సభలో రచయిత్రి తప్ప చాలా మంది తెలుసు. పుస్తకం కొన్నా ఎక్కడో కలిసి పోయింది. కానీ నెలరోజులు ముందే ఝాన్సీ గారు ఏదో పనిమీద ఫోన్ చేశారు. ఆవిడ fb స్నేహితురాలే. ఇప్పుడు మరల పునః పరిచయం. ఆవిడ రాసిన మూడు పుస్తకాల trilogy పంపించారు. మొదటి పుస్తకం ఈ 'అనచ్చాదిత కథ '.
గ్రామం లోని అత్యంత కష్ట పరిస్థితుల నుండి బయిట పడి కొత్త జీవితాన్ని నిర్మించుకున్న సాహస వనిత 'నళిని'. డబ్బు, ఇల్లు, పిల్లల చదువు, వీటిని సాధించ కలిగింది కానీ కుటుంబం తోటి మనుషుల ఈర్ష్య ద్వేషాలు అగ్ని సెగలై కాల్చి వేసాయి. ఈమె కూతురే 'జానకి'.
మంచి తనం, చదువు ఈమె ఆభరణాలు. విధి వ్రాతకు సమాజ ఈర్ష్య కు బలైయ్యింది. అయినా నిలబడింది. వీరిద్దరి వీరిచిత గాధ.. ఈ నవల. ఆపకుండా చదివించే గుణం బాగావుంది. 90 శాతం నిజజీవిత ఘటనలే ఈ నవలకు ప్రేరకాలు అని రచయిత్రి అంటున్నారు. జరుగుతున్న నిజాన్ని చెప్పగలగడం గొప్ప విషయమే. ఈ నవలను తప్పక చదవండి. జీవిత అనుభూతులను పొందండి.
------------------------------------------------------------------
ఈ పుస్తకం కోసం, పాలపిట్ట  బుక్స్, (హైదరాబాద్) ను సంప్రదించండి.

కామెంట్‌లు