పరమ పదము;-ఎం. వి. ఉమాదేవి -బాసర
జీవితపటంలో 
పాములూ నిచ్చెనలెన్నో చేరి 
మనిషిని ఓ ఆట ఆడిస్తాయి!
పైకి రావడానికి నిచ్చెన 
కొందరు అదో బాధ్యతగా తామే నిచ్చెనలై.., 
చేయూతనిస్తారు !
శ్రామికజనం స్నేహితుడుగా, 
గడ్డివామికి,పూరికప్పు 
పెంకులూ సరిచేసేసాధనలో 
నిచ్చెన ప్రధానమే.. 
పెచ్చులు రాలిన గోడలు 
కళ తప్పిన భవనాలు 
రాజరిక ఠీవితో కళకళకి 
సున్నాలేసే సాధనమిదే 
కొత్త సిన్మా హోర్డింగు,వస్తువులప్రకటన
మాటలనిచ్చెనలూ ఉంటాయి 
డబ్బులుఊరికే రావనేదే 
పసిడి ధగధగలకి నిచ్చెనమాట!

అటుఇటు మార్చుకోగలవి 
కొయ్య, ప్లాస్టిక్, వెదురు,ఇనుపనిచ్చెనలే 
మానవజీవితంలో మహాసాయం!
చిన్నికొట్టులో ఎక్కువసరుకునిల్వ 
నిచ్చెనతో పైకప్పువరకూదాచి!
ఎన్నోఉపయోగాల నిచ్చెనకి కృతజ్ఞతలు!!


కామెంట్‌లు