గాజులు ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 గాజులండి గాజులు రకరకాల గాజులు
రంగురంగుల గాజులు రమ్యమైన గాజులు 
అందమైన గాజులు అందం పెంచే గాజులు 
!! గాజులు!!
సన్నటివి,లావువి గాజులండి గాజులు
మట్టివి, ప్లాస్టిక్ వి గాజులండి గాజులు
లక్కవి,లోహపువి గాజులండి గాజులు 
!! గాజులు!!
పాలరంగు, నీలిరంగు గాజులండి గాజులు
ఎర్రరంగు, కర్రెరంగు గాజులండి గాజులు 
ఆకురంగు, పసుపురంగు గాజులండి గాజులు 
!! గాజులు!!
అద్దాలు పొదిగిన ముద్దు ముద్దు గాజులు
చెమ్కీలు అద్దిన చూడచక్కని గాజులు
చక్కగా తీర్చిదిద్దిన మనసుదోచే గాజులు !!గాజులు!!
పసిపాపల కోసం చిట్టిచిట్టి గాజులు
బాలికల కోసం చిన్నచిన్న గాజులు 
పెళ్ళికూతురు కోసం అందాల గాజులు !!గాజులు!!
యువతులకు ఉన్నాయి గాజులు
ప్రౌఢలకు ఉన్నాయి గాజులు 
వృద్ధ మహిళలకు ఉన్నాయి గాజులు !!గాజులు!!
అన్నిరకాలవి అందరికోసం
మేలిమి రంగుల మేలుకలయిక
సింగిడియే నా బుట్టలోన ఉన్నది 
!! గాజులు!!

కామెంట్‌లు