శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ
 భడౌంచ్ అనే ప్రాంతంలో భృగుమహర్షి ఆశ్రమం ఉండేది. ఆయన పేరుమీదుగానే  భృగుపుర్ భృగ్ కచ్ఛ  భృగుకచ్ఛప్ అని పిల్చేవారు.పశ్చిమ సముద్రతీరంలోని  ఒక పుణ్య క్షేత్రం  రేవు ప్రాంతం గా వన్నెకెక్కింది.భృగుమహర్షి గాయత్రి మంత్రం పఠిస్తూ తపస్సు చేశాడు. గరుడుడు తపమొనరించిన ప్రాంతం కూడా  ఇదే!
చిత్ర కూట్ సమీపంలో  బాందా జిల్లా లో భరత్ కూప్ ఉంది. రాముని రాజ్యాభిషేకం చేయటం కోసం  భరతుడు  చిత్ర కూట్ వెళ్లాడు. కానీ భరతుడు తెచ్చిన  పవిత్ర ఉదకాలతో తను రాజ్యం స్వీకరించను అని  రాముడు తేల్చి చెప్పాడు. అత్రిముని ఆదేశం తో తను తెచ్చిన  పవిత్ర జలాలను చిత్ర కూట సమీపంలో ఉన్న ఒక బావిలో భరతుడు పోశాడు. అప్పటినించీ దాని పేరు భరత్ కూప్(బావి) గా స్థిరపడింది.ఈనీటితో స్నానం చేస్తే ముక్తి లభిస్తుంది అని నమ్మకం!
భాగప్రస్థ అపభ్రంశపు రూపం బాగ్పత్! మేరఠ్ ప్రాంతంలో ఉంది. పాండవులు అడిగిన  ఐదు ఊళ్ళల్లో ఇది ఒకటి! దుర్యోధనుడు నిరాకరించాడు🌹

కామెంట్‌లు