రెండురోజుల అంతర్జాల జాతీయ వెబినార్
 అంశం : ‘’బాలసాహిత్యం-భవిష్యత్తు-చర్చ ’’ 
నిర్వహణ:శ్రీశ్రీ కళావేదిక, ఎస్కేయు శాఖ 
నల్లాని రాజేశ్వరి ఫౌండేషన్, అనంతపురము సంయుక్త నిర్వహణ
             శ్రీశ్రీ కళావేదిక ఎస్కేయూ శాఖ మరియు  నల్లాని రాజేశ్వరి ఫౌండేషన్, అనంతపురము సంయుక్త ఆధ్వర్యంలో 2022 నవంబర్  24 & 25, తేదీలలో 
‘’బాలసాహిత్యం-భవిష్యత్తు-చర్చ’’ అనే అంశంపై   రెండురోజుల అంతర్జాల జాతీయ వెబినార్ జూమ్  వేదిక ద్వారా నిర్వహించడానికి సంకల్పించామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాము.
  నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. మంచి ఆరోగ్యవంతమైన బాల సమాజం నిర్మించగలిగితే బాధ్యతాయుతమైన భావిభారత పౌరులు సమాజానికి మూల స్తంభాలుగా నిలుస్తారు. కాబట్టి ఆ మంచి సమాజాన్ని నిర్మించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సాహిత్య పరంగా బాలల సాహిత్యం ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉంటే బాగుంటుంది అన్న చర్చను జరపాలని నిర్ణయించాం. బాలల మనోవికాసానికి ఇతోధికంగా దోహదపడుతూ, బంగారు భవితవ్యానికి మార్గం చూపుతూ , దారిదీపమై వెలుగునిచ్చేది బాలసాహిత్యం. కాబట్టి
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు మన పిల్లల ఆకాంక్షలు వారి అభివృద్ధి ఏవిధంగా ఉండాలో సాహిత్య వేత్తలుగా మన కలల్ని అభిప్రాయాల్ని పంచుకోవడానికి ఇది ఒక మంచి వేదిక కాగలదని ఆశిస్తున్నాము. గతంలో బాల సాహిత్యం ఎలా ఉంది?  ప్రస్తుతం ఏ కోణంలో నడుస్తుంది? భవిష్యత్తులో ఎలా ఉండాలి? అన్న కోణంలో విశ్వవిద్యాలయాల ఆచార్యులు, ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు, పాఠశాల ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులు మరియు సాహిత్యాభిమానుల నుంచి వ్యాసాలను ఆహ్వానిస్తున్నాము. 
ఇతర భాషల్లో బాల సాహిత్యం ఎలా ఉంది అన్న కోణంలో కూడా తులనాత్మకంగా, బాల సాహిత్యం- అనువాద రచనల ఆవశ్యకతను గురించి కూడా రాయవచ్చు.
         సదస్సులో పాల్గనదలచిన  అధ్యాపకులు, సాహితీవేత్తలు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు,ఔత్సాహికులు ఈ కింది వాట్సప్ లింకు https://chat.whatsapp.com/D3a6prtoEhVFxqcjqF5bEi
ద్వారా గ్రూపు లో జాయిన్ అయి వారి పేర్లను నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాము.
               ఈ సదస్సులో పరిశోధన పత్రాలను సమర్పించదలచినవారు తమ పూర్తి పత్రాన్ని  10.11.2022 తేదీ లోపల అయిదారు పేజీలకు మించకుండా  A4  సైజులో, అను 7 ప్రియాంక  పాంట్ 18 , లైన్ స్పేస్ 21 తో ,పేజ్ మేకర్ లో Open File, Pdf file ను కింద పొందుపరిచిన మెయిల్ ఐడీకి సకాలంలో పంపగలరు.
Mail id: 
balasahithyam@gmail.com
ఎంపిక చేయబడిన ప్రామాణిక పరిశోధనాపత్రాలను ISSN నెంబరుతో UGC Care List జర్నల్ తో పుస్తకరూపంలో ప్రచురిస్తాము.
( గమనిక: పుస్తకం Soft Copy మాత్రమే కావాలనుకుంటే 500  పుస్తకం కూడా కలిపి కావాలనుకుంటే 500  
మొత్తం 1000 రూపాయలు చెల్లించాలి). 
ఈ కింది నెంబర్
9490194780 కు గూగుల్ పే / phonepay చేయగలరు. గూగుల్ పే phonepay చేసిన స్ర్కీన్ షాట్ ను కింద వాట్సప్ గ్రూపులో పంపగలరు.
 సదస్సులో పాల్గొనడానికి,పత్ర సమర్పణ చేయడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. 
 రిజిస్ట్రేషన్ చేసుకొని సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ 
 E-Certificate ఇవ్వబడుతుంది
 సదస్సు సంచాలకులు 
డా. బత్తల అశోక్ కుమార్,అధ్యక్షులు, శ్రీశ్రీ కళావేదిక ఎస్కేయూ శాఖ 9490194780

 నిర్వహణ 
శ్రీశ్రీ కళావేదిక, ఎస్కేయు శాఖ,
నల్లాని రాజేశ్వరి ఫౌండేషన్, అనంతపురము సంయుక్తంగా

కామెంట్‌లు