కె. వి.అర్. కళాశాలలో గద్వాల సోమన్నకు సన్మానం
 పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నకు కె. వి.అర్. కళాశాల,కర్నూలులో ఘన సన్మానం జరిగింది. నిఖిలేష్ ఎడ్యుకేషనల్ తెలుగు అకాడమీ వారి ఆధ్వర్యంలో "నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా రచనలు-సామాజిక ప్రయోజనాలు" ఒక్క రోజు  సెమినార్ లో ముఖ్య వక్తగా పాల్గొన్న గద్వాల సోమన్నకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఇందిరా శాంతి, కల్కుర చంద్రశేఖర్, ఆ సంస్థ అధ్యక్షులు మట్టిలేటి,కార్యదర్శి మనోహర్,తెలుగు అధ్యాపకులు పార్వతీదేవి,హనుమంతప్ప మరియు డా.హరికిషన్ గారులు  సత్కరించారు.అనంతరం సోమన్న రచించిన పుస్తకం ఆవిష్కరించారు.తాను  రచించిన దాదాపు 200 పుస్తకాలు విద్యార్థులకు గద్వాల బహుకరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అతిథులు,సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు