విజయహాసం;--నెల్లుట్ల సునీత( శ్రీరామ)ఖమ్మం
మస్తిష్కంలో నిద్రాణమైన 
శక్తిని వెలికి తీసి
జ్ఞాన శోధనలు చేసే
 అన్వేషకులు గా
నింగికి నిచ్చెన వేసి
ఆ సుదూర సౌధాన్ని
చేరుకుందాం!

గమ్యం ఎంత దూరమో 
అంతే చేరువ కదా
లక్ష్యసాధనకు 
అడిగేసి నప్పుడు
గగన మార్గం సులభమే!

ఆశయాల 
తలుపులు తెరిచి
స్వాగతించాలి
 ఆలోచనల్ని

అనంత నీలాకాశంలో
బరువంతా అంతః క్షేత్రంలో
  దాచేసి
మెరుపుల పోరాటంతో
 శ్రమించి
కాంతివేగంతో పయనించి 
కార్యదక్షత సాధిద్దాం!

అనంత త్యాగాలే కాదు
 అద్భుత విజయాలు 
మన సొంతం అని నిరూపిద్దాం!

విజ్ఞాన అడుగులు వేసి
గగనంలో మిస్సైల్స్ ఉంచి
 సాంకేతిక తో సాధించిన
 విజయాలు ఎన్నో..?

కలలు కని వాటిని
సాకారం చేసు కొమ్మ నే
నినాదం నిజం చేస్తూ
భవిష్యత్తుకు బాటలు వేసి
గగనతలంలో 
విజయపతాక ఎగురవేసి
విజయ హాసాలతో 
విశ్వమంత వెలుగొందుదాం!!

కామెంట్‌లు