కంజాతభవురాణివాణి నా తెలుగు!;-కిలపర్తి దాలినాయుడు

 (క-గుణింత గేయం)
----------------------------------------
కలహంసనడకలో కులుకు నా తెలుగు
కారుచీకటిచీల్చు వెలుగు నాతెలుగు
కిలకిలారావాల చిలుక నాతెలుగు
కీర్తనారంజకంబైనదీతెలుగు
కుముదపల్లవమార్దవంబు రాతెలుగు
కూతలో కోకిలల్ పలుకు నాతెలుగు
కృతులందు ధ్యానమైకూర్పునా తెలుగు
కౄరచిత్తుని మనసు మార్చునా తెలుగు
కెరటాల మేనాను పడుచు నా తెలుగు
కేదారములు పండు పొలమునా తెలుగు
కైత కన్నెల కెపుడునెలవు నాతెలుగు
కొంజివురుసౌరులను మీటునా తెలుగు
కోటలో రతనాల మూటనా తెలుగు
కౌముదుల్ విరజిమ్ముకల్కి నా తెలుగు
కంజాతభవురాణివాణి నా తెలుగు!
--------------------------------------

కామెంట్‌లు