మనకీర్తి శిఖరాలు ;-;పద్మశ్రీ డాక్టర్ ఇందిరా హిందూజా. -డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 పద్మశ్రీ డాక్టర్ ఇందిరా హిందూజా. . ఎం.డి, పిహెచ్‍డి భారతదేశానికి చెందిన పేరొందిన స్త్రీ వ్యాధి నిపుణులు, ప్రసూతి వైద్యురాలు, సంతాన సాఫల్య నిపుణురాలు. ఈవిడ బొంబాయి లోని హిందుజా ఆసుపత్రి లో వైద్య సేవలు అందిస్తున్నారు. 1986, ఆగస్టు 6న బొంబాయి లోని కె. ఇ. ఎం. ఆసుపత్రిలో భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబి ఈవిడ ఆధ్వర్యంలోనే జన్మించింది.గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్‍ఫర్ (GIFT) అనే ప్రక్రియలో సిద్దహస్తులు. ఈ విధానం ద్వారా మనదేశంలో 1988, జనవరి 4 న భారతదేశపు మొట్టమొదటి GIFT శిశువుని జన్మింపజేశారు. అదే విధంగా సంతాన భాగ్యం లేని లక్షదాది మహిళలకు అండ దానము ప్రక్రియ ద్వారా సంతానభాగ్యం కలిగించారు. ఇదే విధానంలో 1991, జనవరి 24 న మనదేశంలో మొదటి శిశువు జన్మించింది.
Human In Vitro Fertilization and Embryo Transfer' అనే అంశంపై పరిశోధనా పత్రం సమర్పించి బొంబాయి విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టా అందుకున్నారు. కె. ఇ. ఎం. ఆసుపత్రి, బొంబాయి లో పూర్తికాలపు ప్రసూతి , సంతానసాఫల్య నిపుణురాలుగా పనిచేస్తున్నారు. అలాగే ముంబాయి పి.డి. హిందూజా జాతీయ ఆసుపత్రి , పరిశోధనాశాల లో ప్రసూతి , సంతానసాఫల్య విభాగంలో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పురస్కారములు.
యువ భారతీయురాలు (Young Indian) పురస్కారము (1987)
Outstanding Lady Citizen of Maharashtra State Jaycee Award (1987)
భాతర్ నిర్మాణ్ పురస్కారము (1994)
ముంబాయి మేయర్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కారము (1995; 2000)
Federation of Obstetrics and Gynaecological Society of India ద్వారా జీవితకాల సాఫల్య పురస్కారము (1999)
మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా ధన్వంతరి పురస్కారము (2000)
భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారము (2011) 

కామెంట్‌లు