నవ్వులదివ్వెలు;-కిలపర్తి దాలినాయుడు
(జాతీయస్థాయిదీపావళికవితలపోటీలో ఉత్తమకవితగా ఎంపికైన పద్యాలు)
తే.గీ.1
వెతలె చీకట్లునరకులువేరులేరు
గతులు మార్చునుమనుజుల స్థితినిమార్చు
నాడు వలయును గుండెలో బీడు దున్ని
 నవ్వు దివ్వెలు పెదవిపై నాటవలయు!
కం.2
నరకులనేకులుగలరిట
నరులను బాధించుటకును నానావిధముల్!
నరకములుగలవుపెక్కులు
సిరిమగనిని గొల్చువారు సేమంబౌరా!
తే.గీ.3
వీరవనితలు గలనేలవేదహేల!
ధీర వనితలు గలనేలదివ్య శాల!
నరకశతములనణచెడెనారులున్న
భారతంబిది పౌరుష భద్రకాళి!
కం.4
గుమ్మము లాహ్వానించును
గుమ్మలు దీపములు పెట్టకూరిమితోడన్
కమ్మెడి చీకటి ముద్దను
చిమ్మును గదబాణసంచిచిచ్చుల తోడన్!
కం.5
పిల్లల నవ్వుల తళకులు
వెల్లువలై వెలుగునింపువేడుక నింపున్
మల్లెల జల్లులు పూయును
పల్లెలు నగరాలు పేల్చు బాంబులు పెక్కుల్!
----------------------------------------


కామెంట్‌లు