బడాయి పిల్లి ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
బడాయి పిల్లికి
భలే దోస్తులు
పందిపిల్లను చూసి 
పరుగెత్తువారు
కుక్కపిల్లను చూసి 
కూర్చుండువారు
ఎలుక పిల్లను చూసి 
ఎగిరేవారు 
చేపపిల్లను చూసి 
చేయిజాచువారు 
పాలకుండను చూసి 
పడుకునేవారు 
బడాయిపిల్లికి ఉన్న 
దోస్తుల చూసిన
బాలలందరూ  
కిలకిల నవ్వారు !!
****************


కామెంట్‌లు