సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 క్షతము...క్షితము
  ******
ఎవరికీ మనవల్ల  ఎలాంటి క్షతము,క్షితము కలగకుండా చూసుకోవాలి.
ఎవరికైనా అలా చేస్తే మానసికంగా, శారీరకంగా ఎంత బాధ పడతామో ఆ స్థానంలో మనల్ని ఊహించుకుంటే, ఎప్పుడూ అలాంటివి చేయకుండా ఉంటాం.
ఈపాటికి అర్థమై వుంటుంది ఆ పదాల అర్థాలు.క్షతము అంటే గాయము, దెబ్బ,క్షతి,ఘాతము,వ్యధము లాంటి అర్థాలు ఉన్నాయి.
 అందుకే "తానొవ్వక నొప్పించక తప్పించుకోవడం కాదు కానీ ఒప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!" అన్న శతక కర్త మాటలను సదా గమనంలో ఉంచుకోవాలి.
ఇక క్షితము అనేది మనిషిలోని కౄరమైన మనస్తత్వానికి చిహ్నం.
అలాంటి లక్షణం ఉన్న వారు హింస, ద్రోహమునకు పాల్పడుతూ ఉంటారు.
 క్షితము అంటే ఏమిటో తెలిసింది కదా!
క్షితము అంటే హింస,అట్టము,అతి సర్జనము,ద్రోహము,క్రాథము,వర్జనము,పరిమార్పు,హింసనము లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
అహింసను పరమ ధర్మంగా పాటించే దేశం మనది.అహింస అనే ఆయుధంతో స్వాతంత్ర్యం సాధించుకున్న ఘనత కూడా మనదే.
అందుకే హింసకు దూరంగా, ఇతరులకు ద్రోహం చేయకుండా మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని గడపడమే మనసున్న మనుషులుగా మనయొక్క  ధర్మం.  
క్షతమును క్షితమును వీడాలి.మానవతా హృదయం కలిగిన వ్యక్తులుగా జీవించాలి.
 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు