కవయిత్రి చంద్రకళ.దీకొండ కు ప్రత్యేక బహుమతి

 అంతర్జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా పాలమూరు కవన వేదిక,తెలంగాణ వారు నిర్వహించిన అంతర్జాతీయ కవితల పోటీలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన స్కూల్ అసిస్టెంట్ ,కవయిత్రి చంద్రకళ.దీకొండ గారికి ప్రత్యేక బహుమతి లభించింది.న్యాయ నిర్ణేతగా కిలపర్తి దాలినాయుడు గారు వ్యవహరించారు.ఈ సందర్భంగా పాలమూరు కవన వేదిక అద్యక్షులు రవి చంచల గారు, సమన్వయకర్త సునీత బండారు గారు మరియు ఇతర సాహితీ మిత్రులు చంద్రకళ గారిని అభినందించడం జరిగింది.

కామెంట్‌లు