గజల్ ; -చంద్రకళ యలమర్తి
మిశ్రగతి
రదీఫ్ : బాగున్నది
*---**----*


నీలిమేఘమాలికలే ముసురుతుంటె బాగున్నది
జోరుగాను జడివానే కురుస్తుంటె బాగున్నది

సప్తస్వర గీతాలే పాడుతుంటె బాగున్నది 
వీణమీద రాగాలే మీటుతుంటె బాగున్నది 

రివ్వుమనీ  స్వచ్ఛమైన చల్లగాలి వీస్తున్నది 
చినుకులనే ఒడిసిపట్టి  దాచుతుంటె బాగున్నది

 పసివారీ కేరింతలు అందమయిన ముచ్చటకద
కాగితాలపడవలతో ఆడుతుంటె బాగున్నది

ఎన్నాళ్ళకు రైతన్నల కష్టమంత ఫలియించెను 
ఆకుపచ్చ గ పైరులే ఎదుగుతుంటె బాగున్నది

గుడిగంటల గణగణలే మధురంగా మోగేనులె 
పావురాలు గుంపుగాను ఎగురుతుంటె బాగున్నది 

వాననీట చందురుడే ముత్యమల్లె మెరిసాడులె 
వెన్నెలింట వానల్లో తడుస్తుంటె బాగున్నది
**


కామెంట్‌లు