చిత్రానికి పద్యం ; -సాహితీసింధు సరళగున్నాల

 తే.గీ*గిరులు తోటలు వనముల గెలుపునొంది
పారెగంగమ్మ తిరుగుచు వంకలన్ని
నింపె చెరువులు కుంటలు నీటితోడ
హర్షమొందిరి జనులెల్ల స్పర్శదగుల
కామెంట్‌లు