కందేపి రాణీప్రసాద్ 'విహారం'

 సృజనాత్మకతతో చిన్నపిల్లల మానసిక వికాసానికి కృషిచేస్తోన్న కందేపి రాణీప్రసాద్ తన యాత్రా వివరాలతో
తీసుకువచ్చిన పుస్తకమే.. 'విహారం..'
              ఇందులో రచయిత్రి సందర్శించిన ప్రదేశాలను మనకళ్ళకు కట్టినట్టుగా ఎంతో సరళంగా, హృద్యంగా, పూర్తి వివరాలతో వర్ణించిన తీరు పాఠకుల ఊహా ప్రపంచంలో ఆయా ప్రాంతాలను దర్శింపచేస్తుంది. ఆయా ప్రాంతాలకుచెందిన చిత్రాలను కూడా ఇందులో పొందు పరచడం వల్లఈ పుస్తకానికి సమగ్రత ఏర్పడింది.
            తన భర్తతో కలిసి సింగాపూర్ ఏయిర్లైన్స్లోవెళ్తున్నప్పుడు పక్కసీటులో గుమ్మడి గారు కనిపించినపుడుకలిగిన ఉద్వేగాల్ని ఎంతో ఆనందంగా వర్ణించారు.సింగాపూర్ సమయం మనకన్నా రెండు గంటలు ముందుంటుందట. 63 దీవుల సమాహారమే సింగాపూర్. ఇక్కడ రైల్వేలన్నీ భూగర్భంలోనేసాగుతాయట. హెూటల్లో భోజనానికి ఆర్డర్ వేస్తే ఇక్కడిలాగా మంచినీళ్ళివరట. అవి ప్రత్యేకంగా కొనుక్కోవాల్సిందేనట. సింగాపూర్లో ఒక కొండ నుండి మరో కొండకు చేరుకునేందుకు కేబుల్కార్లుంటాయట. ఇలాంటి విశేషాలెన్నో ఈపుస్తకంలో ఉన్నాయి.
          సింగాపూర్లోని సెంట్సాలో లో ఓ ఎంటర్టైయిన్పార్క్ వాటర్ డ్యాన్స్ గురించి  రచయిత్రి చక్కడా వర్ణించారు. వెంటనే వెళ్ళి చూడలనిపించేలా రాశారు. రాణీప్రసాద్ స్వతహాగా కవితాహృదయం కలిగి ఉండడం వల్ల సంధ్యాసమయంలో తన బెంగుళూర్ విమాన యాత్ర గురించి రాసిన,'మొహం మీద ముసురుకుంటున్న చీకటి ముంగురుల్ని సవరించుకుంటూ పరుగులెత్తే పిల్ల సమీరాలుమెత్తగా ఒళ్ళంతా స్పృశిస్తుంటే పరవశంతో ఆరు బయట నిలబడ్డ నీలి మబ్బుల్ని చూసి సిగ్గుతో పగడపుదీవులయ్యాయి..' అనే మాటలు వెంటనే విమాన యాత్ర చేయాలనిపించేలా ఉన్నాయి.
          బెంగళూరు, మైసూర్, శ్రీరంగపట్నం తదితర ప్రాంతాలను తన అక్షరాల ద్వారా   కొత్తకోణంలో చూపించారు. మహారాజా ప్యాలెస్, చాముండీ బెట్ట, బృందావన్ గార్డెన్, కావేరీఎంపోరియం, మానస గంగోత్రి యూనివర్శిటీ, మైసూర్ మ్యూజియం మొదలైన ప్రాంత విశేషాలను ఈపుస్తకంలో చక్కగా వివరించారు. మైసూర్ మ్యూజియంలోని ఒక చీకటి గదిలో ఉన్న ఎస్.ఎల్ హెూల్డెన్కర్ అనే చిత్రకారుడి 'గ్లో ఆఫ్ హెూప్' అనే చిత్రం గురించి ప్రత్యేకంగా రాశారు.
         తన ముంబయి యాత్ర గురించి రాస్తూ, గేట్వే ఆఫ్ ఇండియా, తెలుగు కేంద్రమైన ఆంధ్రమహాసభ తదితర ప్రాంతాల గురించి చక్కగా రాశారు. ఈ పుస్తకం విహారయాత్రలకు వెళ్ళే  వారికి గైడ్ కూడా ఉపయోగపడే లక్షణాలు కలిగి ఉంది. పుస్తకానికి ఉపయోగించిన కాగితం నాణ్యత లోపించింది. ముద్రారాక్షసాలు కూడా అక్కడక్కడా
పంటికిందిరాయిలా తాకుతాయి. తానుచూసి, అనుభూతి చెందిన వివిధ ప్రాంతాలను పాఠకుల కళ్ళకు కట్టినట్లుగా రాయడంలో రచయిత్రికృతకృత్యులయ్యారనీ చెప్పవచ్చు. ఆమెకు అభినందనలు.
కామెంట్‌లు