కాలేయం ; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్
 కాలేయాన్ని నేను.మానవ దేహం లో ప్రధాన అవయవాన్ని నేను.అయినప్పటికీ గుండె ప్రధాన అవయవం అని పేరు పొందింది.ఎక్కడ చూడు చరిత్ర వక్రీకరణ లే.ప్రచార ఆర్భాటాలు లేకుండా ఏమీ జరగటం లేదు.నా గొప్పదనం నేనే చెప్పుకోవాలి.లేకుంటే ఎవరో నా స్థానం ఆక్రమించుకుంటూ ఉంటారు.గుండె కు కొద్దిగా కష్టం రాగానే కొట్టుకోవడం మానేస్తుంది.దెబ్బకు మనీష చచ్చి పోతాడు. అదే నేనయితే ఎంత కష్టాన్ని అయినా ఓర్చుకుని పని చేస్తూనే ఉంటాను.మనీషికి నెప్పి తెలియకుండా చూస్తాను.కానీ నన్ను ఎవరైన గుర్తించారా.ఏనాడైనా జాగ్రత్తలు తీసుకున్నారా. లేదు.భయపెట్టే వాడిదే రాజ్యం.అన్నిచోట్లా వివక్ష కొనసాగుతోంది.

కామెంట్‌లు