ఆదిలాబాద్ జిల్లా లోనె తొలి మహిళా అవధాని శ్రీమతి వనజ వల్లంభట్ల అవధాని. మొలక


శ్రీ కడారి దశరథ్ గారి సారథ్యంలో " తెలంగాణ తెలుగు కళా నిలయం " భైంసా సాహితీ వేదికలో  శ్రీ మడిపల్లి భద్రయ్య గారి నిర్వహణలో పద్య విద్యనభ్యసిస్తు పద్యాలు వ్రాస్తున్న క్రమంలో పద్యం లోని లోపాలు సరిచేయడం లో అవధాని శ్రీ శశి శర్మ బొల్లాప్రగడ గారి పరిచయంతో  వారు అందులోని గుణ దోషాలను తెలపడం వలన లాక్షణికంగా సరిచేసుకునే క్రమంలో వారు వనజ గారిలో  ఉన్నటువంటి పట్టుదల దీక్ష పద్య పటుత్వం పరీక్షించి , పదగుంభనాన్ని పరిశీలించి సరిచేసి పద్యభాషను నేర్పిన క్రమంలో అవధాని శ్రీ శశి శర్మ గారి అవధానం లో  వారికి సంచాలకత్వం వహించే బాధ్యతను అప్పగించారు. ఆ అవధానం లో సంచాలకత్వానికి ముగ్ధులై పృచ్ఛకులు ప్రశంసల జల్లు కురిపించారు. ఇలా వద్దిపర్తి పద్మాకర్ గారు, శ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి గారు మరియు శ్రీ శశి శర్మ బొల్లాప్రగడ గారి అవధానాలలో పృచ్ఛకురాలుగా పాల్గొని సునిశిత పరిశీలన చేసి అవధాన విద్య పట్ల ఆసక్తి తో అవధాని శ్రీ శశి శర్మ బొల్లాప్రగడ గారి వద్ద మూడు నెలలు అవధాన శిక్షణ తీసుకుని  అవధాన ప్రస్థానం దసరా నవరాత్రులలో ఏడవరోజు సరస్వతీ అవతారం మూలా నక్షత్రం ఆదివారం తేదీ. 2-10-22 న జూమ్ వేదికగా ఆర్ట్ ఫౌండేషన్ కళారత్న  శ్రీ పొట్లూరి హరికృష్ణ గారి అధ్యక్షతన  మొదటి అవధానం ప్రారంభం అయింది. తేదీ. 09-10-22 ఆదివారం అవధాని శ్రీ శశి శర్మ బొల్లాప్రగడ గారి తోనే కలిసి యుగళావధానం చేయడం జరిగింది. అవధాన విద్య నేర్పి అవధాన రంగంలో నిల్పిన అవధాన గురువు, అవధాని శ్రీ శశి శర్మ బొల్లాప్రగడ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతాభి వందనాలు అర్పించారు అనీ శ్రీమతి వనజ వల్లంభట్ల అవధాని గారు ఆదిలాబాద్ జిల్లా లోనె మొదటి మహిళా అవధానిని అని డా// శ్రీ కోవెల శ్రీనివాసాచార్యులు గారు తెలిపారు..
కామెంట్‌లు