ఫామ్ హౌస్-.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,మేడ్చల్.

 పశువులను కొనే పందెంలో
పరాకాష్ఠ.
ప్రజాస్వామ్య పరిరక్షణలో 
తలోచేయి.
ఎత్తులకు పై ఎత్తులే కాదు
కోట్లకు కోట్లు ఎర.
ప్రతినిధుల నిర్వాకాలకు ప్రజలు నోరెళ్ళబెట్టారు.
దిష్టిబొమ్మల దహనాలు,
ఆరోపణలు,ప్రత్యారోపణలు
షరామామూలే.
విరబూసిన గులాబీల మాటున ముళ్ళెన్నో.
రేకు రేకుకు దాపరికమున్నా
ఐకమత్యమే బలం.
గుట్టుచప్పుడయ్యిందా
ఇక ప్రచారానికి కొదువేముంది?ముందస్తు వ్యూహాల వెనుక కర్తలెవరో,
కర్మ ఎవరికి కాలిందో,
క్రియైతే జరిగిపోయింది.
రాజకీయాల రంగుల మాటున
ఊసరవెల్లుల బిక్కమొహాలు.
వారెవ్వా! దొందూ దొందే!
అభివృద్ధిలో అందనంత దూరమెగిరిన మేలుజాతి పశువులు కొన్నైతే,
సంకరజాతి రకాలు సంకురాతిరి దాకా ఆగాల్సిందే.
యాజీల ఆగమనాలు
కొనుగోళ్ళకు శ్రీకారాలు.
మొయినాబాదులో మొయిన్ గేట్లు తెరిచారు.
ఇక ప్రవాహంలో కొట్టుకుపోయేదెందరో?
కామెంట్‌లు