సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ప్రత్యూషము...ప్రత్యూహము
 *****
 ప్రత్యూషమంటే ప్రభాతము,విభాతము, ఉషస్సు,ప్రాతఃకాలం,నిశాంతం ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
ప్రత్యూషము చైతన్యానికి చిహ్నం.సకల చరాచర జగత్తును చైతన్య పరిచే శక్తి ప్రత్యూషానికి ఉంది.
ప్రాతఃకాలంలో ప్రకృతిలోని అందాలను, ప్రభాకరుడి కిరణాల వర్ణాలను వీక్షిస్తుంటే ఎలాంటి నిరాశ నిస్పృహలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయి. నూతనోత్తేజం, ఉల్లాసం కలుగుతాయి.మనసుకు కూడా ఎంతో ప్రశాంతత చేకూరుతుంది.
మానసిక ప్రశాంతత చేకూరాలంటే, ప్రత్యూహముతో కూడిన మనోక్లేశం తొలగాలి.
ప్రత్యూహము అంటే ఆటంకం,అవరోధం, అంతరాయం, భగ్నం, విఘ్నం, విఘాతము మొదలైన అనేక పదాలకు అర్థంగా ఉపయోగించే పదం.
మన ఉన్నతికి, ఆనందానికి ప్రత్యూహముగా ఉన్న వ్యధలను, బాధలను తొలగించుకొని  విభాతాన్ని ఆహ్వానిద్దాం.
ప్రత్యూహానికి దూరంగా జరిగి ప్రత్యూషానికి దగ్గరవుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు