కలిసికట్టు! అచ్యుతుని రాజ్యశ్రీ

 టీచర్ పాఠం చెప్తుంటే "టీచర్!దోమలు కుట్టి కుట్టి చంపుతున్నాయి"పిల్లలు అంతా ఒక్క సారి గగ్గోలు పెట్టారు. కరెంటు పోవడం తో ఫ్యాన్లు అన్నీ ఒక్క సారి  ఆగిపోయాయి. "నేను రోజూ ఏంచెప్తున్నాను?ఒంటికి ముఖ్యంగా చేతులు కాళ్ళకి వేపనూనె పూసుకుని రమ్మన్నాను.క్లాస్ దగ్గర చెత్తచెదారం నీరు నిల్వ ఉండకూడదని చెప్పాను. ""వర్షం!మేమేమి చేయాలి?" "నిజమే!అంతా ఐక్యత తో ఉండాలి. తిండి లేక వరదల్తో బాధపడుతున్నారు వేలాది జనాలు!మనం హాయిగా బడికొచ్చి ఫ్యాన్ల కింద కూచుని చదవడం బద్ధకం! సరే!ఓకథ చెప్తా వినండి! ఆఅడవిలో చిన్న కోతిపిల్లలు ప్రతి మొక్క చిన్న చెట్లను వేళ్ళతో సహా పీకి కింద పడేస్తున్నాయి.పెద్ద కోతులు చూస్తూ ఊరుకున్నాయి.
: వేటగాళ్లు వలవేసి చిన్న జంతువుల్ని పట్టుకుంటే పెద్ద జంతువులు  చూస్తూ ఊరుకున్నాయి.ముసలికోతికి ఇదినచ్చలేదు."చూడండి!మనం ఇలా చిన్న జంతువుల్ని పోగొట్టుకుంటే ఉడతలు ఎలుకలు ఎక్కువై మొక్కలన్నీ చస్తాయి.చెట్లు నాశనం ఐతే మనం ఎక్కడ ఉంటాం? రేపు నన్ను కూడా పట్టుకెళ్ళి రోడ్డు పై ఆడిస్తాడు మనిషి!ఆపై సింహం  పులి కూడా బోనులో చిక్కితే జూ లో పెడ్తాడు.వేరే దేశాలనించి జంతువులను దిగుమతి చేసుకుంటాడు.మనం కలిసి కట్టుగా వేట గాడితో పోరాడాలి". అంతే ఆరోజు వేటగాడు రాగానే చీమలన్నీ వాడి పాదాల్ని కుట్టి పైపైకి ఎక్కి శరీరమంతా కుట్టసాగాయి.తలపై పావురాలు కాకులు పొడవటంతో వలని కింద పారేసి గంతులేయసాగాడు.ఎలుకలు మీద పడ్తే చుట్టూ చేరి కుక్కలు భౌభౌ అరవసాగాయి.అంతే ఆరోజు నించి ఆఅడవిలోని చిన్న చితక ప్రాణులు ఏకమై వేటగాళ్లు రాకుండా  కాపలా కాశాయి.అడవి కుక్కలు అడవి బైట నించి ఎవరూ రాకుండా  కాపలా కాయసాగాయి.మనంకూడా అంతే"టీచర్ కథకి పిల్లలు చప్పట్లు కొట్టారు. కరెంటు వచ్చి ఫ్యాన్లు గిరగిరా తిరగసాగాయి🌹
కామెంట్‌లు