భారత దేశ ఘనత;-జె.నిర్మల తెలుగు భాషోపాధ్యాయురాలు--జ.ప .బాలికల ఉ.పాఠశాల కొండపాక
సీ.మా
శత్రుసేనల జంపి శక్తి యుక్తుల జూపి
వీరత్వమును గన్న దీర భూమి
విజయ లక్ష్మిని కోరి వీరులందరి తోడ 
సన్నుతి గాంచిన సమర భూమి
వేదాలు నాదాలు వెల్లివిరిసె నిందు
త్యాగల నెలవైన ధన్య ధరణి
మునిపుంగవులతోడ మూర్తీభ వించిన 
పావన మైనట్టి భవ్యభూమి
పాప సంచయముల పార ద్రోలగ నిల
పుణ్య నదులు పారు పుణ్య భూమి
ప్రజల యాకలి దీర్చు పసిడి పంటలతోడ
భాసిల్లు చున్నట్టి భరత భూమి

తే.గీ
విశ్వవిఖ్యాత కళలకు విమల భూమి
భావ గంభీర పరిపూర్ణ వరముభూమి
కన్న తల్లిని బొగడరా ఘనముగాను
అందుకోవమ్మ భారతీ వందనములు
🙏🙏🙏🙏


కామెంట్‌లు